V6 News

ఊదు.. నేను ఊదను ...బంజారాహిల్స్ పరిధిలోని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో యువతి హల్చల్

ఊదు.. నేను ఊదను ...బంజారాహిల్స్ పరిధిలోని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో యువతి హల్చల్

జూబ్లీహిల్స్ , వెలుగు: అర్ధరాత్రి ఓ యువతి తప్పతాగి హల్​చల్ సృష్టించింది. బంజారాహిల్స్ పరిధిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అగ్రసేన్ వైపు కారులో వెళ్తున్న యువతిని స్టడీ సర్కిల్ మలుపు వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. 

బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా, సహకరించకుండా వాగ్వాదానికి దిగింది. ‘నేను ఊదను’ అంటూ మొండికేస్తూ, తన కారు తాళాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.