జబర్దస్త్​లో జూనియర్​ సమంత

జబర్దస్త్​లో జూనియర్​ సమంత

డబ్​స్మాష్​, టిక్​టాక్​ వీడియోలతో తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే  మస్త్​ పాపులర్​ అయింది అన్షురెడ్డి. చూడటానికి అచ్చంగా సమంతలానే ఉండటంతో  క్రేజీ సోషల్​ మీడియా స్టార్​గా మారింది. బిగ్​బాస్–3 లో కూడా అలరించిన ఈ క్యూట్​ గర్ల్​ తాజాగా జబర్దస్త్​లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికీ బిగ్​బాస్​–3 కంటెస్టెంట్స్​ రోహిణి, హిమజ  జబర్దస్త్​లో తమదైన కామెడీ మార్క్​తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. రీసెంట్​గా ఆ లిస్ట్​లోకి అన్షురెడ్డి వచ్చి చేరింది. దీని ప్రోమోని తాజాగా జబర్దస్త్​ యూనిట్​ రిలీజ్​ చేసింది. అందులో అన్షురెడ్డి, తాగుబోతు రమేష్​తో కలిసి నవ్వులు పూయించింది. ప్రోమో చూసిన ఆడియెన్స్​ షో కోసం ఇప్పట్నుంచే ఎదురు చూపులు మొదలుపెట్టారు. ఆల్​ ది బెస్ట్​ అన్షుఅంటూ సోషల్​ మీడియాలో కామెంట్లు ​ కూడా పెడుతున్నారు. ఈ ఎపిసోడ్​ అక్టోబర్ ఎనిమిదిన ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌  ముందుకు రాబోతుంది