పుతిన్ మెంటలోడు: రష్యా వార్‌పై కేఏ పాల్ ఫైర్

పుతిన్ మెంటలోడు: రష్యా వార్‌పై కేఏ పాల్ ఫైర్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడంపై ఇంటర్నేషనల్ పీస్ మేకర్ కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెంటలోడని, ఆయన సర్వనాశనం చేస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. ఈ యుద్ధం నిలువరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, 21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని విలపిస్తూ చెప్పారు. గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను తమ బలగాలు ఉక్రెయిన్ కు పంపాలని చెప్పానని, కానీ ఆయన ఓకే చెప్పి కూడా ఆ పని చేయలేదని మండిపడ్డారు. బైడెన్ కు కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. యుద్ధాన్ని ఆపాల్సిన ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదన్నట్లుగా మాట్లాడారని, ఆయన బుర్ర పనిచేయడం లేదని, తక్షణం రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలను కూడా ఈ యుద్ధం ఆపాలని కోరానని, కానీ ఫలితం లేదని అన్నారు. తన సూచనలను ఎవరూ పట్టించుకోలదని, ఈ యుద్ధం ఫలితం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై పడనుందని, అన్నీ ధరలు పెరిగి సామాన్యులపై పెను భారం పడే ప్రమాదం ఉందని అన్నారు. ఉక్రెయిన్ లో అమాయక ప్రజలు చనిపోతున్నారని, ఇప్పటికైనా స్పందించిన ఈ యుద్ధానికి అడ్డుకునేందుకు భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు ప్రయత్నించాలని కేఏ పాల్ కోరారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించిన రష్యా 

‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

ఈ కుంభకర్ణుడు.. పడుకుంటే పోతాడు!