కూలుతున్న కచ్చా పాండ్స్.. పట్టించుకోని ప్రభుత్వం

కూలుతున్న కచ్చా పాండ్స్.. పట్టించుకోని ప్రభుత్వం
  • కూలుతున్న కచ్చా పాండ్స్
  • శిథిలావస్థలకు చేరిన బిల్డింగ్​
  • పట్టించుకోని ప్రభుత్వం

కామారెడ్డి, వెలుగు: నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో చేప పిల్లల ఉత్పత్తి సెంటర్​ ఉంది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్‌‌‌‌కు అతి సమీపంలో దీన్ని చాలా ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. చేప పిల్లల ఉత్పత్తి కోసం ఇక్కడ కచ్చా పాండ్స్, ఆర్సీసీ పాండ్స్ ఉన్నాయి. కొన్నాళ్ల పాటు ఇక్కడ చేప పిల్లల ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత మూలన పడేశారు. మెయింటనెన్స్‌‌‌‌కు ఫండ్స్​రిలీజ్ కాకపోవడంతో పాండ్స్, బిల్డింగ్ శిథిలమయ్యాయి. మళ్లీ ఇటీవల ఇక్కడ చేప పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ఉన్న వనరులకు అనుగుణంగా ఉత్పత్తి లేదు.

గవర్నమెంట్ చెరువులు, ప్రాజెక్టుల్లో  చేపల పెంపకం చేస్తోంది. మత్స్య సోసైటీల నుంచి కాకుండా గవర్నమెంట్ మొత్తం పిల్లలను ఉచితంగా వేస్తోంది. పెరిగిన తర్వాత స్థానికంగా ఉన్న మత్స సహకార సభ్యులు వాటిని పట్టుకుని ఉపాధి పొందుతున్నారు.  అయితే జిల్లాలో ఉన్న సాగునీటి వనరులు చెరువులు, ప్రాజెక్టులకు అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వం ప్రైవేట్‌‌‌‌లో కొనుగోలు చేస్తోంది. ఇందుకు రూ.లక్షల్లో సొమ్ము ఖర్చు చేస్తోంది. గవర్నమెంట్ తమ దగ్గర ఉన్న వనరులతో చేప పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్న వీటిని కంప్లీట్‌‌‌‌గా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. గవర్నమెంట్ ఆధీనంలోని ప్రొడక్షన్ సెంటర్లకు సరిపడా ఫండ్స్ ఇచ్చినట్లయితే ప్రైవేట్‌‌‌‌లో పిల్లలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. కామారెడ్డి జిల్లాలో  627 చెరువుల్లో 2.72 కోట్ల చేప పిల్లల్ని వేస్తున్నారు. 

 అచ్చంపేట సెంటర్ పరిస్థితి..
అచ్చంపేట సెంటర్‌‌‌‌‌‌‌‌లో సుమారు 2 నుంచి 3 కోట్లకు పైగా చేప పిల్లల ఉత్పత్తి చేపట్టే వనరులు ఉన్నాయి. కచ్చా పాండ్స్, ఆర్సీసీ పాండ్స్ ఉన్నాయి.  ప్రస్తుతం 50 లక్షల వరకు చేప పిల్లల పెంపకం జరుగుతోంది. కచ్చా పాండ్స్​సైడ్ వాల్స్ కూలిపోతున్నాయి. వీటిని రిపేర్ చేయడం, తగినన్ని నీటి వనరులు కల్పించడం, పైపులైన్, ఆఫీసు బిల్డింగ్, స్టాఫ్‌‌‌‌ను పెంచడం చేస్తే చేప పిల్లల ఉత్పత్తి  మరింతగా పెంచే అవకాశం ఉంది. పాండ్స్​రిపేర్, పైపులైన్ల ఏర్పాటు, ఆఫీసు బిల్డింగ్​నిర్మాణం కోసం  4 ఏళ్ల కింద అప్పటి కలెక్టర్​ సత్యనారాయణ రూ. 2 కోట్లతో  ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు పరిశీలించినా ఫండ్స్ రిలీజ్ కాలేదు. నిరుడు  కేవలం రూ.4 లక్షల ఫండ్స్​వచ్చాయి. వీటితో పాండ్స్ రిపేర్​ చేసి, బోరు వేయించారు. నిరుడు 40 లక్షల వరకు చేప పిల్లల్ని ఉత్పత్తి చేసి జగిత్యాల జిల్లాకు సప్లయ్ చేశారు. సెంటర్‌‌‌‌  మెరుగుపర్చినట్లయితే  కామారెడ్డి జిల్లాకు కావాల్సిన చేప పిల్లలు ఉత్పత్తి  జరిగే అవకాశముంది. పిల్లల ప్రొడక్షన్​ పెంచినట్లయితే  పక్క జిల్లాలకు కూడా సప్లయ్​ చేయవచ్చు. గవర్నమెంట్​సెంటర్‌‌‌‌‌‌‌‌లోనే చేప పిల్లల ప్రొడక్షన్​జరిగినట్లయితే క్వాలీటీ ఉంటుంది.  
 
చేప పిల్లల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సెంటర్లను ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. చేప పిల్లల ఉత్పత్తి చేసే కచ్చా పాండ్స్ సైడ్ వాల్స్ కూలిపోయి.. ఆఫీసు బిల్డింగ్ శిథిలావస్థకు చేరినా సెంటర్ ఆధునీకరణకు గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. ఉన్న వనరులు వినియోగించుకోకుండా చేప పిల్లల కోసం ప్రైవేట్‌‌‌‌ సంస్థలను ఆశ్రయిస్తోంది.  

ఉన్న వాటినే వినియోగించుకుంటున్నాం
ప్రస్తుతం ఉన్న పాండ్స్‌‌‌‌లో చేప పిల్లలను పెంచుతున్నాం. కచ్చా పాండ్స్​కొన్నింటి సైడ్ వాల్స్ పడిపోయాయి. మాడర్‌‌‌‌నైజేషన్‌‌‌‌తో పాటు విస్తరించేందుకు గతంలో ప్రప్రోజల్స్ వెళ్లాయి. ఫండ్స్ రావాల్సి ఉంది.    
–వెంకటేశ్వర్లు, జిల్లా ఫిషరీష్ ఆఫీసర్​