కొడుకు ఫోటోను షేర్ చేసిన కాజల్

కొడుకు ఫోటోను షేర్ చేసిన కాజల్

టాలీవుడ్ బ్యూటీ కాజల్‌ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల చందమామ. తన సినీ కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఇప్పటికీ అదే జోరుతో దూసుకుపోతుంది. ఈ బ్యూటీ పెళ్లైన తర్వాత కూడా వరుస అవకాలను అందిపుచ్చుకుంటోంది. అయితే నిన్న మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ ఇటీవల అమ్మ అయ్యింది.. ఈ యేడాది ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక తన కుమారుడుకి ఈ రోజుతో రెండు నెలలు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా కాజల్ ఓ అరుదైన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. కుమారుడు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ అమ్మతన్నాన్ని ఆస్వాదిస్తోంది.. కుమారుడే లోకంగా సమయం గడుపుతోంది. అంతేకాదు తన ముద్దుల తనయుడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలో కాజల్ తన కొడుకును ఎత్తుకొని ప్రేమగా ముద్దు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.