KH 234 నుంచి కమల్ హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్

 KH 234 నుంచి కమల్ హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్

36 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) - దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam). వీరిద్దరి కాంబోలో 1987 లో  వచ్చిన నాయకన్..తెలుగులో నాయకుడు సెన్సేషనల్ హిట్ అందుకుంది. 

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న కమల్ హాసన్ KH234 మూవీ నుంచి కమల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కమల్ హాసన్ గంబీరమైన కళ్ళతో చూసే పులిలా..నిండైన ముసుగుతో ఉన్న యోగిలా ఇంటెన్స్ పెంచుతున్నాడు. అలాగే ఈ మూవీ నుంచి ఇవాళ (నవంబర్ 6) సాయంత్రం 5 గంటలకు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేస్తోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా..KH 234 నుంచి ఇవాళ అప్డేట్స్ రానున్నాయి.  

ఈ మూవీకి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, కెమెరామెన్‌గా రవి కే చంద్రన్, ఫైట్ మాస్టర్ గా అన్బరివ్ పని చేస్తుండగా..ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ తమిళ శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 మూవీ షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా శంకర్ భారతీయుడు మూడో పార్టుకు సంబంధించిన షూట్ కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది.