Indian2: 'ఇండియన్‌ 2’ విలన్‌ విశేషాలు..తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వివరాలు

Indian2: 'ఇండియన్‌ 2’ విలన్‌ విశేషాలు..తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వివరాలు

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎస్జే సూర్య..ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్ లో శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ ‘భారతీయుడు2 (Indian 2), రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీస్ లో నటిస్తున్నాడు. అయితే, ఈ నెల (జులై 12న) ఇండియన్2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో వరుస ప్రమోషన్స్ లో ఎస్జే సూర్య పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘తాజాగా ఈ సినిమాలో నేను తెరపై కనిపించేది కొద్దిసేపే మాత్రమే కావచ్చు. కానీ, ఆ సీన్స్ ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అని సూర్య చెప్పుకొచ్చారు.ఐతే,ముందుగా శంకర్ తెరకెక్కించిన  రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్‌’లో తన నటన చూసి ‘ఇండియన్ 2’లో అవకాశం ఇచ్చారని సూర్య అన్నారు. 

అయితే,గేమ్‌ఛేంజర్‌’లో రామ్‌ చరణ్‌తో కలిసి చేసిన కొన్ని సీన్స్ చూసిన శంకర్‌ నాకు ‘ఇండియన్‌ 2’లో విలన్‌ పాత్ర చేసే అద్భుత  అవకాశమిచ్చారు. ఇందులో నా క్యారెక్టర్ ఎంటైర్ నా సినీ కెరీర్లోనే ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో ఒకటిగా ఉంటుందని సూర్య తెలిపారు. ఎందుకింత కాన్ఫిడెన్స్ గా చెప్పగలను అంటే, డైరెక్టర్ శంకర్ 'విలన్‌ పాత్రలకు తనదైన మేనరిజాన్ని జోడించి దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు..అంటూ సూర్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే..ఇండియన్ 2 మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ ను జులై 7న ఆదివారం ఎన్ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 6 గంటలకు షురూ కానుంది. ముఖ్య అతిధిగా ఎవరిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.