వానలో డ్యాన్స్ చేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్

వానలో డ్యాన్స్ చేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్

వాషింగ్టన్: డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ వానలో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైర ల్ అవుతోంది. ఫ్లోరిడాలో ఎలక్షన్ క్యాంపెయిన్​లో భాగంగా ఆమె వానలో ఛత్రి పట్టు కొని డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానికి ‘‘రెయిన్ ఆర్ షైన్, ప్రజాస్వామ్యం ఎవరి కోసం వెయిట్ చెయ్యదు” అని క్యాప్షన్ పెట్టారు. తన స్టాఫ్ లో ఇద్దరికి కరోనా రావడంతో కొన్ని రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఆమె.. సోమవారం తిరిగి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఎలక్షన్లలో ఫ్లోరిడా ఓటర్లు కీలకమని, వారే విన్నర్​ను డిసైడ్ చేస్తారని హ్యారిస్ అన్నారు