కందికొండ ఆశయాలకు కృషి చేయాలి : కె. ఆనందాచారి

కందికొండ ఆశయాలకు కృషి చేయాలి : కె. ఆనందాచారి

నాగర్​కర్నూల్, వెలుగు: కందికొండ రామస్వామి ఆశయ సాధనకు కృషి  చేయాలని తెలంగాణ సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి పిలుపునిచ్చారు. అంతరాలు లేని సమాజం కోసం కమ్యూనిస్టుగా తుది శ్వాస వరకూ పోరాడారని కొనియాడారు. ఆదివారం నాగర్​కర్నూల్ లోని పీఏసీఎస్​ హాల్​లో ‘నెల పొడుపు’ సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం అవార్డు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పురస్కారానికి ఎంపికైన ‘డిమ్కి కథల’ రచయిత్రి స్పూర్తి కందివనంకు అవార్డు ప్రదానం చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఆనంద్, మల్లు రవి, డా.పెబ్బేటి మల్లికార్జున్, వనపట్ల సుబ్బయ్య, పర్వతాలు, శ్రీనివాసులు, కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.