Kangana Ranaut: ఐశ్వర్య రాయ్పై ‘లావు ఆంటీ’ అంటూ కామెంట్స్.. ట్రోలర్లపై శివంగిలా విరుచుకుపడిన కంగనా

Kangana Ranaut: ఐశ్వర్య రాయ్పై ‘లావు ఆంటీ’ అంటూ కామెంట్స్.. ట్రోలర్లపై శివంగిలా విరుచుకుపడిన కంగనా

మాజీ మిస్ వరల్డ్, స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్పై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య తన అద్భుతమైన లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఐశ్వర్య రాయ్ లుక్, డ్రెస్సింగ్ విధానంపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్‌కు దిగారు. ముఖ్యంగా ఆమె వయసును టార్గెట్ చేస్తూ వచ్చిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. ‘కేన్స్లో లావు ఆంటీ’ అంటూ కొందరు నెటిజన్లు ఐశ్వర్యను ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయారు.

ఈ కామెంట్స్పై ఐశ్వర్య రియాక్ట్ అవ్వనప్పటికీ.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ, నటి కంగనా రనౌత్ మాత్రం ఐశ్వర్య తరుపున స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చింది. ఆమె ఎవరిని మెప్పించేందుకు కేన్స్కు రాలేదని.. వయసైన మహిళలను రెడ్ కార్పెట్పై చూసేందుకు అలవాటు పడండి అంటూ తనదైన శైలిలో ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చింది. 

ఇకనైనా అలవాటు చేసుకోండి..

కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ..“ఫ్యాషన్, స్టైల్ అనేవి వ్యక్తిగత నిర్ణయం. అది ఒకరి జీవితాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఈ విషయంలో ఏ మహిళ కూడా ఎవరికీ ఎటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేన్స్ లో ఐశ్వర్య అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆమెను మరోలా చూడాలనుకునే వారు ముందుగా మీ దగ్గర ఏముందో ప్రపంచానికి చూపించండి.”

ముఖ్యంగా “ఐశ్వర్య అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ. ఆమె ఎవ్వరినీ మెప్పించడానికి కేన్స్కు రాలేదు. అయినా.. రెడ్‌కార్పెట్‌పై ఎప్పుడూ యంగ్ హీరోయిన్స్ మాత్రమే ఉండరు. ఇలా 50 ఏళ్లలో ఉన్నవారు కూడా మెరుస్తారు. పెద్ద వయసు మహిళలను చూడడం మీకు అలవాటు లేకపోతే, ఇకనైనా అలవాటు చేసుకోండి’’ అంటూ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు కంగనా.

ఇకపోతే, కేన్స్‌తో ఐశ్వర్యకు చాలా కాలంగా అనుబంధం ఉంది. ప్రముఖ బ్యూటీ బ్రాండ్ లోరియల్ పారిస్ గ్లోబల్ అంబాసిడర్‌గా 2003 నుంచి ఆమె కేన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ‘లుమినారా’ (Luminara) అనే స్కల్ప్చరల్ బ్లూ గౌన్‌లో అప్సరసలా మెరిసిపోయారు.

ALSO READ : అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ రేటుకు..

దాదాపు 1500 గంటల పాటు చేత్తో శ్రమించి, వేల సంఖ్యలో క్రిస్టల్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో శరీరంపై కాంతి కిరణాలు ప్రవహిస్తున్నట్లు ఈ డ్రెస్‌ను క్రేజీగా డిజైన్ చేశారు. ఫ్రెంచ్ రివేరా వేదికపై ముదురు నీలి రంగు (Abyss blue) గౌన్‌లో ఆమె నమస్తే అంటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. హాలీవుడ్ స్టార్ ఇవా లాంగోరియాతో కలిసి ఆమె ‘ది బర్త్‌డే పార్టీ’ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.