యాదగిరిగుట్టలో కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు

యాదగిరిగుట్టలో కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు
  • 17న సాయంత్రం ఉట్లోత్సవం, 
  • రాత్రి శ్రీకృష్ణ, రుక్మిణీ కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు సోమవారం షురూ అయ్యాయి. శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్ధతుల్లో మూడు రోజుల పాటు నిర్వంచనున్నారు.  ఉదయం కణ్ణన్ పెరుమాళ్(శ్రీకృష్ణ), లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు నవకలశ స్నపన విశేష తిరుమంజన సేవ చేపట్టి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను ఆరంభించారు.

 సోమవారం మొదలైన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు ఈ నెల 17 వరకు వైభవోపేతంగా జరగనున్నాయి. 16, 17 తేదీల్లో ఆర్జిత సేవలు యథాతథంగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.