
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండం విశేషం. రీసెంట్‌గా ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా నటిస్తోన్న తలైవర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయగా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తన ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లారు రజినీకాంత్.
తాజాగా రజనీకాంత్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. "మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి భారతదేశాన్ని గర్వించేలా చేసిన లెజెండరీ, అత్యంత అద్భుతమైన వ్యక్తి కపిల్‌దేవ్ జీతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా ఉంది" అని రజినీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో కపిల్ కూడా ఈచిత్రంలో నటిస్తున్నారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరికొందరు మాత్రం కపిల్ శర్మకు సంబంధించిన పాత్రలో రజినీ నటిస్తున్నారేమోనని అంటున్నారు. దీనిపై మున్ముందు క్లారిటీ రానుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.