వివాదం వెనుక ఎవరున్నారో నాకు తెలుసు..ఎవ్వర్నీ వదలను

వివాదం వెనుక ఎవరున్నారో నాకు తెలుసు..ఎవ్వర్నీ వదలను

హైదరాబాద్: నేను ఎక్కడికి పారిపోలేదని తెలిపింది నటి కరాటే కల్యాణి. యూట్యూబర్‌ శ్రీకాంత్‌తో వివాదం, పోలీసు కేసు అనంతరం ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి సోమవారం సాయంత్రం మీడియా ముందుక వచ్చింది. పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు వచ్చిన ఆమె తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేసింది. తాను పారిపోయే రకం కాదని, ఎక్కడికి పారిపోలేదని చెప్పింది. తాను పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా.. ఒంటరి మహిళ అంటే అంతా చులకనా.. అంటూ  పైర్‌ అయ్యింది. తన ఇంట్లోనే ఉన్నామని, స్టింగ్‌ ఆపరేషన్‌ చేసుకోండని తెలిపింది.  తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వివాదం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని వారి వివరాలన్నీ బయట పెడతానన్నారు.  మా అమ్మకు ఏమీ తెలియదన్న కల్యాణి.. నేనేం చేసినా మా అమ్మకు చెప్పి చేయనని తెలిపింది. మానవత్వంతో ఆలోచిస్తానని.. నేను ఎంతో మందికి సేవ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై పాప తండ్రి మాట్లాడుతూ..తనకు ముగ్గురూ ఆడపిల్లలేని పాపను పోషించలేకనే పాప భవిష్యత్ కోసమే... తాము కరాటే కల్యాణి వద్ద పెంచుతున్నామని పాప తండ్రి ప్రకటించారు. తాము కూడా పాప తల్లిదండ్రులుగానే కరాటే కల్యాణి ఇంట్లోనే ఉంటున్నామని ప్రకటించారు. లీగల్‌గా దత్తత ప్రక్రియ పూర్తయ్యే వరకూ కల్యాణి వాళ్లింట్లోనే ఉంటామన్నారు. 

తనకు పిల్లలు లేరని.. ఆడపిల్లలంటే ఇష్టమని అందుకే దత్తత తీసుకున్నానన్నామన్న కల్యాణి.. ఏడాది తర్వాత లీగల్‌గా దత్తత తీసుకుందామనుకున్నానని తెలిపారు. తనకు చాలా రోజులుగా అన్యాయం జరుగుతోంది...చాలామంది మీద ఫైట్ చేస్తాను, నిలదీస్తాను, తంతాను కూడా అని ప్రకటించారు. కొన్ని రాజకీయ శక్తులు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కల్యాణి అన్నారు.  అయినా తాను వెనక్కి తగ్గనని ఝాన్సీ లక్ష్మిబాయిలా ఫైట్ చేస్తానని తెలిపారు.  ప్రాంక్‌ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్‌ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి విరిద్దరు కొట్టుకోవడం చర్చకు దారితీసింది. దీంతో ఇద్దరి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కరాటే కల్యాణి కనిపించకుండపోయింది. ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదివారం చైల్డ్‌వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. చిన్నారి పాప దత్తతపై తమకు వివరణ ఇవ్వాలంటూ గతంలో ఆమెకు నోటిసులు ఇవ్వగా తాను స్పందించలేదని అధికారులు మీడియాకు తెలిపారు.  

మరిన్ని వార్తలు

నా కూతురిపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు