- కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం/గంగాధర/చొప్పదండి, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అలర్ట్‌గా ఉండాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. మంగళవారం కరీంనగర్‌లో హోటళ్లు, లాడ్జీల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలతో ఆయుధాలతో సిటీలోని పలు హోటళ్లలో రెండు నెలల పాటు బస చేసి నిఘా నిర్వహించాయని, హోటల్ లేదా లాడ్జీలలో రూములు కేటాయించే ముందు ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
కేవలం ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా అందులోని ఫొటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అని సరిచూసుకోవాలని సూచించారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్-చెక్ చేసుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు.
- బక్రీద్ సందర్భంగా అక్రమంగా ఆవులు, గోవులు, ఇతర నిషేధిత జంతువుల తరలింపును అరికట్టాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. చొప్పదండి మండలం ఆర్నకొండ, కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం మంగపేట, మధురానగర్ శివారులో ఏర్పాటుచేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు.
