ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదు : బండి సంజయ్

 ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదు :   బండి సంజయ్

ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బండి సంజయ్. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్ కి మొరపెట్టుకున్న రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం   రైతులకు ఇచ్చిన హామీలును  ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్.