
కరీంనగర్ ఆర్టీసీ డిపోకు దనరా పండుగ కలిసొచ్చింది. భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించారు. కరీంనగర్ రీజియన్ లో ఆర్టీసీకి రూ. 7 కోట్ల 71 లక్షల 67 వేల ఆదాయం వచ్చినట్లు రీజనల్ మేనేజర్ ఖుస్రో షా ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెల 23 నుంచి ఈ నెల 10 వరకు రీజియన్ లోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య నడిచిన బస్సుల ద్వారా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రెగ్యులర్, అదనపు సర్వీసుల ద్వారా కరీంనగర్ రీజియన్ 19,01,041 కిలో మీటర్లు నడిపినట్లు వెల్లడించారు. ప్రయాణీకులు ఎంతో ఆదరణ చూపి సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకొన్నందుకు ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఇక ముందు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
డిపో | ట్రిప్పులు | కిలోమీటర్లు | ఆదాయం |
గోదావరి ఖని | 605 | 310278 | 13193765 |
హుస్నాబాద్ | 193 | 65744 | 2621024 |
హుజురాబాద్ | 98 | 41114 | 1558437 |
కరీంనగర్ -1 | 794 | 258640 | 11060479 |
కరీంనగర్ -2 | 519 | 162239 | 6761311 |
మంథని | 266 | 148895 | 5810292 |
జగిత్యాల | 561 | 298639 | 12280828 |
కోరుట్ల | 292 | 138331 | 5642325 |
మెట్ పల్లి | 277 | 241439 | 9067452 |
సిరిసిల్ల | 105 | 31546 | 1099233 |
వేముల వాడ | 462 | 204176 | 8071859 |
రీజియన్ | 4172 | 1901041 | 77167005 |