కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల విడుదల.. కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం..

 కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల విడుదల..  కర్ర రాజశేఖర్ ప్యానెల్  ఘన విజయం..

కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 12  స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో 54 మంది అబ్యర్ధులు పోటీ పడగా.. వీరిలో 10 మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, అర్బన్ బ్యాంకు మాజీ ఛైర్మన్లు కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డి ప్యానెళ్ల మధ్య తీవ్ర పోటీ నడవగా.. కర్ర రాజశేఖర్ రెడ్డి ప్యానెల్ ఘనవిజయం సాధించింది. కర్ర రాజశేఖర్ ప్యానెల్ నుండి పోటీ చేసిన 12 మందిలో పోటీ చేయగా 9 మంది రాజశేఖర్ ప్యానెల్, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. 10 మంది గెలుపొందారు.

ఇక జనరల్ కేటగిరిలో కర్ర రాజశేఖర్, దేశ వేదాద్రి, కన్నా సాయి, ఆనందం, సాయి కృష్ణ, అను రాస్, లక్ష్మణ్, రాజు,దీపక్, కిషన్ గెలుపొందారు. మహిళా క్యాటగిరిలో వరాల జ్యోతి, ముద్దసాని శ్వేతా గెలుపొందగా... ఎస్సి, ఎస్టీ కేటగిరిలో సరిల్ల రతన్ రాజు గెలుపొందారు.వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ నుంచి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మొన్నటి వరకు చైర్మన్ గా ఉన్న గడ్డం విలాస్ రెడ్డి సహా అయన ప్యానెల్ లో ఉన్న వారందరు ఓటమి చెందారు.  

అర్బన్ బ్యాంకులో మొత్తం 9వేల 287 మంది సభ్యులకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కేవలం 4 వేల 114 మంది మాత్రమే ఓటు వేశారు.  కరీంనగర్ లో 3,342 మంది, జగిత్యాలలో 772 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 4 వేల 114 మంది ఓటు వేయగా.. 44.26 శాతం పోలింగ్ నమోదైంది. విజయం సాధించిన ప్యానెల్ ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. 

►ALSO READ | హోరా హోరీగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు..

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ముగ్గురు బీజేపీ అభ్యర్థులున్నారు. వీరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు మొదటి నుంచి బండి సంజయ్ పరోక్షంగా మద్దతు పలికారు. తమ ప్యానెల్ విజయం సాధించడం పట్ల కర్ర రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు.