
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోతి చనిపోవడంతో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ మహేశ్ తన సింగపూర్ టూర్‌ను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఆయన పెంచుకుంటున్న చింటూ అనే మూడేళ్ల కోతి జనవరి 1న కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. మైసూరు శివార్లలోని దత్తగల్లిలో ఉన్న మహేశ్ పొలంలో కింద పడిన కరెంట్ తీగలపై పడి చనిపోయింది. అప్పటికే న్యూ ఇయర్ టూర్‌లో ఉన్న మహేశ్‌కు కుటుంబ సభ్యులు మర్నాడే ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే రిటర్న్ ఫ్లైట్‌లో వచ్చి కోతి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ కోతికి రెండు నెలలున్నప్పుడు చుంచనకట్టి నుంచి మహేశ్ తెచ్చుకున్నారట.