కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ఇ టెక్నో స్కూల్‌లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి శివుడి ఫొటోకు పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందన్నారు. ఈనెలలో పూజలు, వ్రతాలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నారు.
