రూ.9 లక్షల బైక్.. ఇండియాలోకి వచ్చేసింది.. ఆరు గేర్లు.. హైస్పీడ్

రూ.9 లక్షల బైక్.. ఇండియాలోకి వచ్చేసింది.. ఆరు గేర్లు.. హైస్పీడ్

కవాసకి ఇండియా ఎట్టకేలకు ఓ ఖతర్నాక్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. హై పెర్ఫార్మెన్స్ బైకులలో ఒకటైన నింజా ZX-4Rను అధీకృత షోరూం లకు విడుదల చేసింది. ఇది 400 సీసీ విభాగంలో అత్యంత ఖరీదైన బైక్.. దీని ధర రూ. 8.49 లక్షలు. కంపెనీ అన్ని అధీకృత షోరూమ్ లను సందర్శించి బైక్ ను బుక్ చేసుకోవచ్చు. కవాసకి అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతుంది.

కవాసకి నింజా ZX-4R డిజైన్ 

కవాసకి నింజా ZX-4R డిజైన్ స్టైల్ పరంగా స్పోర్ట్స్ బైక్.. సొగసైన శైలి, షార్ప్ ఎడ్జెస్ తో ఆకర్షించే లుకప్ తో వస్తోంది. స్ల్పిట్ ఎల్ ఈడీ హెడ్ లైట్లు, సిగ్నేచర్ స్టైల్ టైల్ లైట్, ట్రాన్స్ పరెంట్ విజర్, స్ల్పిట్ సీటింగ్ అరేంజ్మెంట్, మాట్ ఫినిషింగ్ ఇంజన్, క్రోమ్ ఫినిష్ ఎగ్జాస్ట్ తో చూపరులను ముఖ్యంగా యూత్ ను , బైక్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటోంది. 

ఈ బైక్ 399cc లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ మోటార్ ఇంజిన్‌తో 78 bhp శక్తిని , 13,000 rpm వద్ద 39 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్‌తో అద్భుతమై పెర్ఫార్మెన్స్ కలిగి ఉంది.