రైతులకు బేడీలు వేసిన..కేసీఆర్ సర్కారుకు బుద్ధి చెప్పాలి : ప్రవీణ్ కుమార్

రైతులకు బేడీలు వేసిన..కేసీఆర్  సర్కారుకు బుద్ధి చెప్పాలి : ప్రవీణ్ కుమార్

కూసుమంచి, వెలుగు : సీఎం కేసీఆర్  దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బహుజన రాజ్యం కోరుకుంటున్నారన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్  ప్రవీణ్  కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ సర్కారుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను ఆయన కోరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో పాలేరు నియోజకవర్గ బీఎస్పీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రవీణ్  హాజరై మాట్లాడారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్  పాలమూరు సభ కోసం ప్రజలకు డబ్బులిచ్చి తరలించారని ఆయన ఆరోపించారు.

Also Rard: రైతులకు బేడీలు వేసిన..కేసీఆర్ సర్కారుకు బుద్ధి చెప్పాలి : ప్రవీణ్ కుమార్

ముఖ్యమంత్రి అండతో మంత్రి పువ్వాడ అజయ్  కుమార్ అక్రమ మైనింగ్ కు  పాల్పడుతున్నారని, అడిగిన వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. మరో మంత్రి జగదీశ్  రెడ్డి.. జానయ్య యాదవ్ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్  పార్టీది 75 ఏండ్ల పాటు ప్రజలను దోపిడీ చేసిన చరిత్ర అని, ఆ పార్టీ  హైదరాబాద్ లో సభ పెట్టడంవిడ్డూరంగా ఉందని ప్రవీణ్​ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్  నేతలు సభ పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అల్లిక వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బుర్ర ఉపేందర్ సాహూ, మండల అధ్యక్షులు దుంపల సాయిచరణ్, బచ్చలకూరి శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.