ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ 

ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  బీఆర్ఎస్  అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్​, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంతోపాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో ప్రెస్​మీట్​ నిర్వహించనున్నట్లు గంగుల తెలిపారు. ఈ మేరకు బీఆర్​ఎస్‌ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.