అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలి: కేజ్రీవాల్

అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలి: కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉందన్నారు. ఢిల్లీని శుభ్రం చేసేందుకు ఇదొక అవకాశమని కేజ్రీవాల్ అన్నారు. అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలన్నారు. అవినీతి పరులకు ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్ర 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. . ఈస్ట్, సౌత్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి, ఎంసీడీగా మార్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.మొత్తం 250 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మొదటి సారి మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది ఎంఐఎం పార్టీ. 15 ఏళ్ల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీనే గెలుస్తూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఆప్ విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు.