
- అవినీతి ఆరోపణల రావడంతో మంత్రి సింగ్లా తొలగింపు
- సీఎం చర్యలను ప్రశంసించిన కేజ్రీవాల్
- అవినీతికి వ్యతిరేకంగా ఆప్ పోరాడుతందని ఉద్ఘాటన
- గర్వంగా ఉంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అవినీతీ ఆరోపణలు రావడంతో ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను తొలగిస్తూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మాన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ‘భగవంత్ మాన్ జీ! అవినీతి మంత్రిని తొలగిస్తూ మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆనందంతో నా కళ్లు చెమర్చాయి. మీ చర్యల పట్ల దేశం మొత్తం మన పార్టీపై గర్వంగా ఫీలవుతోంది’ అని అన్నారు.
Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022
Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs
టెండర్లపై అధికారుల నుంచి ఒక శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ మంత్రి సింగ్లాపై సీఎం మాన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ చేపట్టిన సీఎం మాన్... మంత్రికి ఉద్వాసన పలికారు. అనంతరం సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని భగవంత్ మాన్ మరోసారి స్పష్టం చేశారు. ఇక పంజాబ్ సర్కారుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని వార్తల కోసం...