తమిళనాడులో ఘరో రోడ్డు ప్రమాదాలు..25మంది మృతి

తమిళనాడులో ఘరో రోడ్డు ప్రమాదాలు..25మంది మృతి

తమిళనాడు రహదారులు రక్తమోడుస్తున్నాయి. వేరువేరు ప్రమాదాల్లో 25మంది మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా మారింది.

తమిళనాడులో రెండు వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తిరుపూర్‌ జిల్లా అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొనడటంతో 20 మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తమిళనాడు సేలం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బాధితులు నేపాల్ కు చెందిన వారిగా గుర్తించగా..ప్రమాద సమయంలో బస్సులో ఇరుక్కున్న క్షతగాత్రుల్ని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.