ఆత్మహత్య చేసుకుంటేగానీ PF ఇవ్వలేదు.. EPFOపై కేరళ కుటుంబం లీగల్ యాక్షన్

ఆత్మహత్య చేసుకుంటేగానీ PF ఇవ్వలేదు.. EPFOపై కేరళ కుటుంబం లీగల్ యాక్షన్

‘‘రిటైర్డ్ అయ్యాను.. నేను సేవ్ చేసుకున్న PF  ఇవ్వండి’’ అని EPFO కార్యాలయానికి వెళ్లిన ఆ వ్యక్తికి నిరాశ ఎదురైంది. డాక్యుమెంటేషన్ సరిగా లేదని .. తప్పులు ఉన్నాయని EPFOఅధికారులు కాల యాపన చేస్తూ వచ్చారు.. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లు అతడిని ఆఫీసు చుట్టూ తిప్పించుకున్నారు.. అప్పటికీ తన PF  ఇవ్వకపోవడంతో విసిగి పోయిన ఆ వ్యక్తి ..ఆఫీసు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అప్పడు ఇచ్చారు పీఎఫ్.. అతని కుటుంబ సభ్యులకు.. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు .. EPFO  కార్యాలయం అధికారులపై లీగల్ యాక్షన్ కు సిద్దమయ్యారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

కేరళకు చెందిన శివ రామన్ అపోలో టైర్స్ లో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తనకు రావాల్సిన దాదాపు 10 సంవత్సరాల పీఎఫ్ బకాయిల కోసం EPFO  ఆఫీసుకు వెళితే.. డాక్యుమెంట్లు సరిగా లేవని బకాయిలు క్లియర్ చేసేందుకు తిరస్కరించారు.తొమ్మిదేళ్లు ఈఫీఎఫ్ ఓ ఆఫీసు చుట్టూ తిరిగినా..EPFO  డాక్యుమెంటేషన్  లో తేడాలున్నాయని  తన ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ALSO READ :- ఖమ్మం మీటింగ్లో బీఆర్ఎస్కు నిరసన సెగ

అయితే శివరామన్ మరణం తర్వాత ఎటువంటి నిబంధనలు లేకుండా కనీసం మరణ ధృవీకరణ పత్రం కూడా అవసరం లేకుండా EPFO  పెండింగ్ బకాయి లను క్లియర్ చేశారు. తన తండ్రి మరణం తర్వాత EPFo బకాయిలు చెల్లించడం శివరామన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉండిపోయింది. శివరామన్ కు న్యాయం చేయాలని , ఇలాంటి అన్యాయం ఇతరులకు జరగకుండా చూడాలని అతని కొడుకు ప్రదీప్ శివరామన్   నిర్ణయించుకున్నారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా EPFO చట్టపరమైన చర్యలకు తీసుకోవాలని కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.