
ఇతర వ్యాధులతోనే అన్న కలెక్టర్
తిరువనంతపురం: కేరళలో కరోనా సోకిన పేషెంట్(85) కోలుకున్నాడని, ఆ తర్వాత కిడ్నీ వ్యాధి, డయాబెటిస్ తో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడని మళప్పురం జిల్లాలోని మంజేరి మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ నందకుమార్ తెలిపారు. ఈ నెల మొదట్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని, ఆ తర్వాత మూడు సార్లు ఏప్రిల్ 7,10,13 తేదీల్లో కరోనా టెస్టులు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని, ఇతర వ్యాధుల తీవ్రతతోనే ఆయన మృతి చెందాడని పేర్కొన్నారు. ‘‘ఆయన కిడ్నీ వ్యాధి, డయాబెటిస్ తో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందారు. నయం చేసేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ, శనివారం తెల్లవారు జామున ఆయన చనిపోయారు” అని డాక్టర్ చెప్పారు. మలప్పురం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ ఇదే విషయం మీడియాకు వెల్లడించారు. పెద్దాయన కరోనాతో చనిపోలేదని, కిడ్నీ సమస్య, గుండె సంబంధిత వ్యాధులకు ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందినట్లు వెల్లడించారు.