మాజీ ఆర్మీ అధికారిని ట్రాప్‌లోకి లాగిన టీవీ నటి

మాజీ ఆర్మీ అధికారిని ట్రాప్‌లోకి లాగిన టీవీ నటి

ఇటీవల కాలంలో హానీ ట్రాప్ కేసులు అధికమవుతన్నాయి. అందమైన అమ్మాయిలను ఎర వేసి.. శాత్రవేత్తలను, ప్రముఖ వ్యాపారవేత్తలను బురిడీ కొట్టిస్తున్న విదేశీ వనితల లీలలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. వీరికి స్వదేశీ మహిళలు కూడా ఏమాత్రం తీసిపోవటం లేదు. ముగ్గులోకి దింపడానికి తమ అందాన్నే పావుగా వాడుతున్నారు. ఇలానే ఓ మలయాళ టీవీ నటి 74 ఏళ్ల మాజీ సైనికుడిని ట్రాప్ చేసి.. అతని నుండి రూ. 11 లక్షలు కొట్టేసింది. 

మాజీ సైనికుడిని రాసలీలల్లోకి దింపి.. 

పతనంతిట్టకు చెందిన మలయాళ నటి నిత్యాశశి.. తన ఇంటిని అద్దెకు ఇస్తానంటూ 74 ఏళ్ల మాజీ సైనికుడితో ఫోన్ కాల్ ద్వారా పరిచయం పెంచుకుంది. నటి కమ్మగా నాలుగు కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి ఆయన.. ఆమె మాయలో పడిపోయారు. అనంతరం స్నేహమంటూ రోజూ అతనికి ఫోన్ కాల్స్ చేసిన నటి.. ఒకరోజు ఇంటికి రమ్మని అతన్ని ఆహ్వానించింది. అక్కడకి వెళ్లిన అతను.. ఆమె అందానికి పరవశించి పోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న నటి.. మరోసారి అతన్ని ఇంటికి ఆహ్వానించింది.

అప్పటికే తన స్నేహితుడి(బిను)ని అక్కడకి పిలిపించుకున్న నటి అతని ద్వారా.. వారి రాసలీలను రహస్యంగా చిత్రీకరించింది. వాటిని సోషల్‌మీడియాలో పెడతామంటూ నిందితులిద్దరూ బాధితుడిని బెదిరించి రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఎక్కడ తన పరువు పోతుందో అన్న భయంతో బాధితుడు రూ.11 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ.. వారు అకృత్యాలు ఆగలేదు. మరింత డబ్బు కావాలంటూ బాధితుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. 

వీరి బెదిరింపులతో విసిగిపోయిన బాధితుడు జులై 18న పరవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశి అనే నటితో ఫోన్ కాల్స్‌ ద్వారా స్నేహం చేశానని, తరచూ ఆమె వద్దకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అలా వెళ్లిన సమయంలో ఒకరోజు.. ఆమె బట్టలు విప్పమని బెదిరించిందని.. ప్రాణభయంతో వారు చెప్పినట్లే చేశానని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పరవూరు పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి డబ్బు చెల్లిస్తామనే నెపంతో బాధితుడి ఇంటికి పిలిపించారు. వారిద్దరూ అక్కడకి చేరుకోగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.