
భర్త ను హత్యచేసిన భార్యకు కోర్ట్ ఉరిశిక్ష విధించింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన ప్రియా యెమెన్ లో నర్స్ గా పనిచేస్తుంది. ఆమెకు 2011లో కేరళకు చెందిన ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. వారికి ఓ పాప. అయితే నర్స్ గా పనిచేస్తున్న ప్రియాకు యెమెన్ లో సొంతంగా క్లీనిక్ పెట్టుకోవాలని కలలు కనేది. అరబ్ కంట్రీలో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే అదేశానికి చెందిన వారై ఉండాలి. చట్టాలకు వ్యతిరేకంగా సొంతంగా సంస్థలు ప్రారంభిస్తే కఠినంగా శిక్షిస్తారు. క్లీనిక్ కోసం ప్రియా యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దు మహాదీని రెండో వివాహం చేసుకుంది.
వివాహం అయిన కొద్ది కాలానికి సొంతంగా క్లీనిక్ ను ప్రారంభించేందుకు చట్టపరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రయత్నించింది.
మహాదీ తన మొదటి భర్తేనని ఫేక్ సర్టిఫికెట్లతో క్లీనిక్ లైసెన్స్ అప్లయ్ చేసింది. లైసెన్స్ వచ్చింది. అప్పటి నుంచి మహదీ..ప్రియను టార్చర్ పెట్టేవాడు. దొంగసర్టిఫికెట్లు క్రియేట్ చేసినందుకు పోలీసులకు చెబుతానని బెదిరించేవాడు.
క్లీనిక్ నడిపే సమయంలో వచ్చిన డబ్బుల్ని మహదీ ఖర్చుపెట్టేవాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియా భర్తను మరో నర్స్ సహాయంతో హత్య చేసింది. డెడ్ బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ లో పడేసింది.
ఈ హత్య వెలుగులోకి రావడంతో 2018లో యెమెన్ పోలీసులు నిందితురాలు ప్రియను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన కోర్ట్ తాజాగా భర్తను చంపిన ప్రియకు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించిన నర్స్ కు జీవితఖైదు విధిస్తూ యెమెన్ కోర్ట్ తీర్పించింది.