టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా

టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా

టిక్ టాక్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న కెవిన్ మేయర్, తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న వనీసా పప్పాస్ తాత్కాలిక సీఈఓగా పనిచేస్తారని సంస్థ తెలిపింది. కెవిన్ తన కెరీర్‌ను డిస్నిలో ప్రారంభించి, విజయవంతమై, ఆపై టిక్ టాక్ లో చేరి, సంస్థ  అభివృద్ధికి ఆయన ఎంతో తోడ్పడ్డారని ఈ సందర్భంగా టిక్ టాక్ చెప్పింది.

అమెరికా ప్రభుత్వంపై టిక్ టాక్ తో పాటు సంస్థ ఉద్యోగి దావా వేయడంతో ఆయన రాజీనామా చేశారు. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్, టిక్ టాక్ కు మాతృసంస్థ. చైనాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్, టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్ముకోవాలంటూ ఆదేశిస్తూ, అందుకు గడువు పెట్టగా.. ఇది సరైన నిర్ణయం కాదంటూ కోర్టులో కేసు దాఖలైంది.