
ఖమ్మం టౌన్, వెలుగు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్యసాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు కేంద్ర ప్రభుత్వం శౌర్యం మెడల్ 2024 కు ఎంపిక చేసింది. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోట లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ ను సీపీ సునీల్ దత్ అందుకున్నారు