కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక

కాంగ్రెస్ నేతలకు ఖర్గే హెచ్చరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పార్టీ నేతలకు మల్లికార్జున ఖర్గే గట్టి వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతతో పని చేయాలని లేదా పక్కకి తప్పుకుని తమ సహచరులకు అవకాశం ఇవ్వాలని లీడర్లకు స్పష్టం చేశారు. పై నుంచి కింది స్థాయి దాకా ఆఫీస్ బేరర్లు జవాబుదారీతనంతో ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పని తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.

కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘జవాబుదారీతనంతో ఉండటమే అతిపెద్ద బాధ్యతని నేను నమ్ముతా. కాంగ్రెస్ బలంగా, జవాబుదారీగా, ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటే.. ఎన్నికల్లో గెలవగలం. దేశ ప్రజలకు సేవ చేయగలం’’ అని చెప్పారు. ‘‘పార్టీలోని నేతలు ఎంతో బాధ్యతతో తమ డ్యూటీ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం బాధ్యతారాహిత్యంతో ఉన్నా చెల్లుతుందని భావిస్తున్నారు. ఇది సరికాదు. ఆమోదయోగ్యం కాదు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వాళ్లు.. పార్టీలోని సహచరులకు దారి ఇవ్వాలి” అని స్పష్టం చేశారు. కాగా, మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.