రాష్ట్రంలో ఇంకా బానిసత్వ పాలన

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ పాలన

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ మనస్తత్వంతోనే  పాలన సాగుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునే పరిస్థితి లేదన్నారు. MIMకి భయపడటం వల్లే సీఎం కేసీఆర్ విమోచన వేడుకలపై మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీకి బానిసగిరి చేస్తూ విమోచన దినోత్సవం జరపడం లేదు. తెలుగు ప్రజల తరపున ప్రధాని మోడీకి పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. సమర్ధవంతమైన మోడీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రజలకు నీతి నిజాయితీ తో కూడిన పాలన అందిస్తున్నారన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో  జాతీయ జెండా ఎగుర వేశారు కిషన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపూరావు,బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

 

దేశంలో ఒక్కరోజే 97 వేల కేసులు..6 కోట్లు దాటిన టెస్టులు