కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ను చూసి గర్వపడుతున్నాం

కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ను చూసి గర్వపడుతున్నాం

హరారే వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్కు ముందు టీమిండియా క్రికెటర్లు చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. జాతీయ గీతం పాడుతున్న సమయంలో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ చేసిన పనిని..ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. 

కేఎల్ రాహుల్ పనికి ఫ్యాన్స్ ఫిదా..
భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్లు జాతీయ గీతం పాడారు. అయితే భారత జాతీయ గీతం రాబోతోంది అని ప్రకటించగానే కేఎల్ రాహుల్.. తన నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను బయటకు తీసి పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో...వైరల్ అయింది. నేషనల్ ఆంథెమ్‌కు రాహుల్ ఇచ్చిన గౌరవాన్ని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. రాహుల్ను చూసి చూసి గర్వపడుతున్నామని కొందరు కామెంట్స్‌ చేశారు.

కుల్దీప్ కదలక మెదలక..
భారత ఆటగాళ్లు జాతీయగీతం పాడుతున్న సమయంలో టీమిండియా బ్యా్ట్స్మన్ ఇషాన్ కిషన్‌‌ను ఓ పురుగు ఇబ్బంది పెట్టింది. అతని చెవిలో దూరాలని ప్రయత్నించింది. అయితే పురుగు సడెన్‌గా ఎటాక్ చేయడంతో కిషన్ కాసేపు హడావుడి పట్టాడు. మళ్లీ వెంటనే తేరుకుని జాతీయ గీతం ఆలపించాడు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. అయితే కిషన్ జాతీయ గీతం పాడుతున్నప్పుడు పురుగు అతన్ని ఇబ్బంది పెట్టినా..అతని పక్కనే ఉన్న  స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం కదలక మెదలక జాతీయ గీతాన్ని పాడాడు. దీంతో అభిమానులు కుల్దీప్ యాదవ్ శ్రద్ధాసక్తులను కొనియాడుతున్నారు.