అసలు ఆర్మీ హాట్ లైన్ చర్చలు అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు ఎలా వాడతారు?

అసలు ఆర్మీ హాట్ లైన్ చర్చలు అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు ఎలా వాడతారు?

గతవారం జరిగిన ఇండియా-పాక్ దాడుల తర్వాత ఎట్టలేకలకు వారాంతంలో కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి. వాస్తవానికి పాకిస్థాన్ పరిస్థితి దిగజారుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డీల్ దిశగా రెండు దేశాలను ఒప్పించారు. అయితే ఇండియా మాత్రం ఆపరేషన్ సిందూర్ ముగియలేదని చెబుతోంది.

ఈ క్రమంలో ఇరు దేశాలకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారులు దీనిపై ఈరోజు సాయంత్రం చర్చించనున్నారు. అయితే ఈ చర్చలు సురక్షితమైన హాట్ లైన్ అని పిలువబడే కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. దీనికింద దిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి పాకిస్థాన్ రావల్పిండి లోని జనరల్ హెడ్ క్వార్టర్స్ కి నేరుగా ఫోన్ లైన్ ఏర్పాటు చేయబడుతుంది. దీని నుంచే ఇరుదేశాలకు చెందిన మిలిటరీ అధికారులు చర్చలు కొనసాగిస్తారు. 

వాస్తవానికి ఈ ప్రత్యేక హాట్ లైన్ 1971 యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడింది. కోల్డ్ వార్ సమయంలో రష్టా-అమెరికా కూడా ఇదే తరహా కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించేవారు. వాస్తవానికి దీనిని అత్యవసరం మిలిటరీ చర్చలు, సమస్యల సమయం, డీఎస్కలేషన్ వంటి సమయాల్లో వినియోగిస్తారు. వాస్తవానికి ఇది పూర్తిగా ఎన్ క్రిప్ట్ చేయబడిన సేఫ్ ల్యాండ్ లైన్ వ్యవస్థ. దీనిలో మాట్లాడిన సమాచారాన్ని ఇంటర్సెప్ట్ చేయటానికి అస్సలు కుదరదు. ఇందులో కాల్స్ నేరుగా మిలిటరీ కార్యాలయం నుంచి మిలిటరీ కార్యాలయానికి కనెక్ట్ చేయబడతాయి. 

ALSO READ | యుద్ధం అంటే రొమాంటిక్గా ఉండదు .. బాలీవుడ్ సినిమా అంతకన్నా కాదు:ఆర్మీ మాజీ చీఫ్

సరిహద్దుల వద్ద కొన్నిసార్లు జరిగే పరిణామాలపై వివరణ ఇచ్చిపుచ్చుకునేందుకు దీనిని ఆర్మీ అధికారులు వినియోగిస్తుంటారు. చారిత్రాత్మకంగా దీనిని కేవలం మిలిటరీ అవసరాలకు మాత్రమే కాకుండా అణు పరీక్షల సమయంలో ముందుగా హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వినియోగించారు. అవసరాలకు అనుగుణంగా ఆర్మీ అధికారులు దీనిని రోజువారీ కూడా వినియోగిస్తుంటారు. రెండు దేశాలు రాజకీయ నాయకుల స్థాయిలో చర్చలు జరగటానికి మునుపు సమస్యల పరిష్కారానికి ఈ హాట్ లైన్ చర్చలను ప్రాథమిక మార్గంగా వినియోగించటం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కువగా దీనిని వారంలో మంగళవారం ఎక్కువగా వినియోగిస్తుంటారని తెలుస్తోంది.