
కోదాడ, వెలుగు : ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటరమణ ఎంపికయ్యారు. వెంకటరమణ ప్రస్తుతం మొయినాబాద్ ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
ఆలిండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం జరిగిన సమావేశంలో వెంకటరమణను నామినేట్ చేసింది. గతంలో కూడా వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. వెంకటరమణ ఎంపిక పట్ల కాపుగల్లు గ్రామానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.