యూట్యూబర్లకు ఎంట్రీ లేదా.. ఏం మాట్లాడున్నారండీ మీరు

యూట్యూబర్లకు ఎంట్రీ లేదా.. ఏం మాట్లాడున్నారండీ మీరు

పశ్చిమ బెంగాల్‌లో నవరాత్రి దుర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గా పండల్‌ల్స్ కు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నవరాత్రుల్లో దుర్గా పండల్స్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఓ దుర్గా పండల్ కు యూట్యూబర్స్ కు అనుమతి లేదట.  

ఈ సంవత్సరం రాష్ట్రంలోని కొంతమంది పండల్ నిర్వాహకులు తమ ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, దుర్గాపూజ పండల్‌ను నిర్వహిస్తున్న కోల్‌కతాకు చెందిన ప్రముఖ పుర్బాచల్ శక్తి సంఘా అనే క్లబ్ ప్రదర్శించిన నోటీసు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నోటీసులో స్పష్టంగా, “యూట్యూబర్లు అనుమతించబడరు” అని ఉంది. ఈ నోటీసును షేర్ చేస్తూ, ఓ X యూజర్ స్వాతి మోయిత్రా.. "కోల్‌కతా పూజలు దీన్ని కలిగి ఉన్నారు" అని రాసుకొచ్చారు.

ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ నోటీస్ కు నెటిజన్లు సైతం సపోర్ట్ చేస్తున్నారు. "ఇది ప్రతిచోటా ఉండాలి. ఈ రోజుల్లో అవి ఇబ్బందిగా మారాయి" అని కొంతమంది అంటున్నారు. ఒక వ్యక్తి మాల్‌లో రద్దీగా ఉన్న దురదృష్టకర ఘటనను ఉదహరించాడు. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చాడు. “యాక్సిస్ మాల్‌లో దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఉంది. అక్కడ దాదాపు 100 -150 మంది కూడా కనిపించరు. కానీ కొంతమంది యూట్యూబర్‌తో ఫోటోలు క్లిక్ చేయడానికి వేలాది మంది రావడంతో ఆ రోజు సెక్యూరిటీ ఎంట్రీని మూసివేయవలసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

సాంప్రదాయకంగా జరిగే దుర్గా పూజ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి, దీని వల్ల పండళ్లు రద్దీగా మారి సందర్భానుసారంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగే వివిధ మతపరమైన సమావేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఇది చిన్న, పరిమిత ప్రాంతాలలో రద్దీకి దారితీస్తుంది. కొన్నిసార్లు దీని వల్ల తొక్కిసలాట వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. 2022లో సంతోష్ మిత్రా స్క్వేర్‌లోని దుర్గాపూజ పండల్ వద్ద జరిగిన లేజర్ షో వేదిక వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో కోల్‌కతా పోలీసులు షో ఆపివేయవలసి వచ్చింది.