దక్షిణాఫ్రికాలో సహజంగా ఏర్పడిన కోమ్​ గుహలు

దక్షిణాఫ్రికాలో సహజంగా ఏర్పడిన కోమ్​ గుహలు

కోమ్ గుహలు.. దక్షిణాఫ్రికాలో సహజంగా ఏర్పడినవి. ఇవి రాతితో ఏర్పడినవి కాదు. మట్టితో కట్టిన గుహలు. టియటియానెంగ్‌కు తూర్పున 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరియా జిల్లాలో ఉన్నాయి. మట్టితో కట్టిన కోమ్​ గుహలు  నేషనల్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందాయి. సౌత్​ ఆఫ్రికాలోని బెరియా జిల్లాలోని పులనే ప్రాంతంలో ‘హా కోమ్ కేవ్ విలేజ్’ ఉంది. 19వ శతాబ్దంలో బాసియా చీఫ్​ తెలెక వంశం ఈ గుహలను కట్టింది. వీటిని కట్టడానికి గల ముఖ్య కారణం.. 18వ శతాబ్దంలో కరువు వచ్చింది. తినడానికి తిండి గింజలు లేక ప్రజలు అల్లాడిపోయారు. దాంతో మొక్కజొన్నల కోసం ‘లిఫాకానే’ యుద్ధాలు జరిగాయి. అంతేకాదు, నరమాంస భక్షణ కూడా జరిగింది. ఆ టైంలో బాసియా, బటాంగ్ వంశాల వాళ్లు గుహల్లో తలదాచుకున్నారు. ఈ గుహల్లో ఇప్పటికీ వారి వారసులు నివసిస్తున్నారు. వాటిలో రాతి మీద చెక్కిన పెయింటింగ్స్​ కూడా ఉన్నాయి.

టూర్​ వేయొచ్చు

గుహల నుంచి రోడ్డు మీదికి 500 మీటర్ల దూరం. ఆ రోడ్డు మీద ‘కోమ్ క్రాఫ్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్’ సెంటర్ ఉంది. ఈ సెంటర్‌కి  పిక్నిక్​ కోసం వెళ్లొచ్చు. అందులో స్థానికంగా తయారుచేసిన క్రాఫ్ట్​లు, టియటియానెంగ్‌లోని లెసోతో మౌంటైన్ క్రాఫ్ట్స్ ఉంటాయి. బార్బెక్యూ స్టాండ్‌లు కూడా ఉంటాయి. పులనే ప్రాంతం చుట్టూ పోనీ(పొట్టి గుర్రం) ట్రెక్‌ చేయొచ్చు. కోమ్ కేవ్ విలేజ్​కి టూర్​ కూడా వేయొచ్చు. విలేజ్​ చూపించడానికి గైడ్​ ఉంటాడు. కావాలంటే క్యాటరింగ్ ఏర్పాటు కూడా చేస్తారు. ఇక్కడ క్యాంపింగ్‌కి కూడా పర్మిషన్ ఉంది. డ్రైవింగ్ చేయాలనుకుంటే హై క్లియరెన్స్ వెహికల్ వాడాలి. గుహలకు వెళ్లాలంటే బూట్లు వేసుకోవాలి. కోమ్ గుహలకు దగ్గర్లో చారిత్రక కట్టడం ‘బోఖోపా’ శిఖరం ఉంది.