కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మండల కేంద్రంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ గ్రామపంచాయతీ సభ్యులు శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో గల్లీకో బెల్ట్ షాపు ఏర్పడి మద్యం విక్రయాలు అదుపు తప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
బెల్ట్ షాపుల నిర్మూలన కోసం గతంలో కలెక్టర్లకు ప్రజావాణిలో వినతులు ఇచ్చినట్లు తెలిపారు. సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, వార్డు సభ్యులు ముత్యం స్వప్న, మహాదేవుని శేషు, గజ్జె వెంకటేష్, కడమంచి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
