మల్లన్న ఆరో ఆదివారం ఆదాయం రూ.37 లక్షల 79 వేల 389

మల్లన్న ఆరో ఆదివారం ఆదాయం రూ.37 లక్షల 79 వేల 389

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆరో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం బుకింగ్ ఆదాయం రూ.37,79,389 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. 

శనివారం రూ.4,18,183, ఆదివారం రూ.29,16,201, సోమవారం రూ.4,45,005 లు వచ్చాయన్నారు. మల్లన్నకు భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, ప్రసాదం, పట్నాలు, బోనాల టికెట్ల అమ్మకం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ బుకింగ్ ఇన్‌చార్జి మాధవి తెలిపారు.