ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ : కొండా సురేఖ

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ : కొండా సురేఖ
  • గజ్వేల్, సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మెజార్టీ
  • రైతుబంధుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మెదక్ సీటు గెలిచి సోనియా, రాహుల్‌‌‌‌‌‌‌‌కు గిఫ్ట్ ఇస్తామని వెల్లడి

సంగారెడ్డి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కొండా సురేఖ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ప్రజలు బుద్ధి చెప్పినా.. వారిలో ఇంకా అహంకారం తగ్గడం లేదన్నారు. రైతుబంధుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు బిచ్చం వేసినట్లుగా రైతుబంధు వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 99 శాతం మేర రైతులకు ఒకేసారి రైతుబంధును వేశామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక నిర్భాంధాలకు గురయ్యామని మంత్రి తెలిపారు. 

ఎన్నో అక్రమ కేసులు నమోదు చేసి, జైలుకు కూడా పంపించారన్నారు. అందుకే ప్రజలు ఆదరించి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి పట్టం కట్టారని వెల్లడించారు. గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో గెలిచి, సోనియా, రాహుల్‌‌‌‌‌‌‌‌కు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌గా ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని మంత్రి కోరారు.

రాహుల్ ప్రధాని కావాలి: జగ్గారెడ్డి

దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆకాంక్షిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి అసెంబ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నీలం మధుకు భారీ మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనంత కిషన్, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.