ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చోటు..డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమ్ ప్రకటన

ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చోటు..డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమ్ ప్రకటన

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:   ఆస్ట్రేలియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ సామ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పోటీపడే ఆస్ట్రేలియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. జూన్ 11 నుంచి లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగే మెగా ఫైనల్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడిన  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ప్రకటించింది.  పాట్ కమిన్స్ నేతృత్వంలోని డిఫెండింగ్ చాంప్ కమిన్స్ సఫారీలను ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఫైనల్ టీమ్ ఎంపికలో పెద్ద ఆశ్చర్యాలు లేవు. ఈ ఏడాది ఇండియా, శ్రీలంకతో ఆడిన జట్టునే దాదాపు కొనసాగించారు. గాయాల కారణంగా శ్రీలంక సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడని కమిన్స్,  హేజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి  దిగే  జట్టులోకి వచ్చారు.  ‘బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో దశాబ్దం తర్వాత ఇండియాను ఓడించిన మా జట్టు శ్రీలంకలో సిరీస్ గెలిచి ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గొప్పగా ఆడింది. ఇప్పుడు లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుకునే అవకాశం వచ్చింది.

సౌతాఫ్రికా సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడానికి మా టీమ్  సిద్ధంగా ఉంది’ అని చీఫ్​ సెలెక్టర్ జార్జ్ బెయిలీ చెప్పాడు. బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో ఇండియాతో  మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసి ఆకట్టుకున్న కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత అదే ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించలేకపోయాడు.  శ్రీలంక టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినా కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు గతేడాది వెన్నుగాయానికి సర్జరీ చేయించుకున్న గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెలెక్టర్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేశారు.

స్పిన్నర్ మాట్ కునెమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేథన్ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్యాకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, బ్రెండన్ డాగెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంచుకున్నారు.  కాగా, ఇదే జట్టు జూన్ 25 నుంచి వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. 

ఆస్ట్రేలియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టస్, మాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్,  స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్.ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.