
ఏ ఇండస్ట్రీలోనైనా పోలీస్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే కెరీర్‌లో ఒక్కసారైనా ఖాకీ డ్రెస్‌లో కనిపించాలి అనుకుంటారు మన హీరోలు. కానీ ప్రభాస్ పూర్తిస్థాయి పోలీస్ క్యారెక్టర్‌లో ఇంతవరకూ నటించలేదు. అభిమానులు కూడా పోలీస్ గెటప్‌లో ప్రభాస్‌ను చూడాలని కోరుకుంటున్నారు. అతి త్వరలో ఈ కోరిక తీరబోతోంది. ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌లో సెన్సేషన్ హిట్ అందుకుని బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా నటించబోతున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న భూషణ్ కుమార్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఆయన రివీల్ చేశారు. నిజానికి ‘సాహో’ సినిమాలో ప్రభాస్ కొద్ది సేపు పోలీస్‌గా కనిపించినా.. అది ఫేక్ అని తర్వాత తెలుస్తుంది. కానీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘స్పిరిట్’లో సూపర్ కాప్‌గా కనిపించబోతున్నాడట ప్రభాస్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. కొరియన్ హీరోయిన్‌ను ఈ మూవీ కోసం తీసుకోబోతున్నారనే టాక్ ఉంది. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది.