జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌‌‌‌ లోకి వస్తే భుజాలపై ఎత్తుకొని తీస్కొస్తా : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌‌‌‌ లోకి వస్తే భుజాలపై ఎత్తుకొని తీస్కొస్తా : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
  •     కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

కోరుట్ల,వెలుగు:  మాజీ మంత్రి జీవన్​రెడ్డి అవినీతి ఎరుగని సీనియర్  నాయకుడని, ఆయన బీఆర్ఎస్‌‌‌‌లోకి వస్తే భుజాలపై ఎత్తుకొని తీస్కొస్తా అని  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు.  శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ​మీడియా సమావేశంలో   మాట్లాడారు.  జీవన్ రెడ్డి 30 ఏండ్ల కింద ప్రజల కోసం ఏ విధంగా పని చేశాడో, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నారని , జీవన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం అని అన్నారు.  

ఆయన బీఆర్ఎస్ లోకి వస్తా అంటే ఆనందంగా స్వాగతిస్తామని,  పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తానే స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తానని అన్నారు.   కాంగ్రెస్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని, ప్రజలను మరోసారి వంచించేలా ఉందని  విమర్శించారు. 

గతంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్​లకే  కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు.  ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని అన్నారు.  సమావేశంలో బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు గడ్డం మధు, కౌన్సిలర్లు పొట్ట సురేందర్​, కొక్కెర వెంకటేష్​, జాల వినోద్,టేకుల నరేష్​, సజ్జు, మిట్టపెల్లి రాజశేఖర్, సనావుద్దీన్, వీరబత్తిని దశరథం,శేర్​ అనిల్, ప్రభు పాల్గొన్నారు.