నారాయణపేటలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేటలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డీఎల్ఎస్సీ మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, ఎస్పీ యోగేశ్​గౌతమ్ తో కలిసి మాట్లాడారు.

పోలీస్, రెవెన్యూ, గనులు, భూగర్భజల శాఖ అధికారులతో 13 టాస్క్ ఫోర్స్  టీమ్​లను ఏర్పాటు చేయాలని, తహసీల్దార్లు, ఎస్ ఐలు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. వర్కూరు, మాగనూర్ రీచ్ లతో పాటు మక్తల్ మండలంలోని చిట్యాల, అడవి సత్యారం రీచ్ లను  ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానం చేసింది. ఫిల్టర్  ఇసుక తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.