పదవి వదులుకునేందుకు సిద్ధం.. కుమారస్వామి ఉద్వేగం

పదవి వదులుకునేందుకు సిద్ధం.. కుమారస్వామి ఉద్వేగం

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగంతో మాట్లాడారు. సాయంత్రంలోపు విశ్వాస పరీక్ష ఉండటంతో… అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

“సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటకలో ఎంతో అభివృద్ధి జరిగింది. నిజాయితీగా కర్ణాటక అభివృద్ధికి పనిచేశాను. నేనెప్పుడూ మాట తప్పలేదు. నిందలు భరించలేను. సీఎం పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల సూచనతోనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ప్రభుత్వం ఏర్పాటుచేశాం. రైతుల సంక్షేమానికి మంచి చర్యలు తీసుకున్నాం. కానీ.. కొంతమంది అవకాశ వాద రాజకీయ నాయకులు నీచ, నిర్లజ్జ రాజకీయాలకు పాల్పడ్డారు. మేం చేసిన తప్పేంటో మాకు అర్థం కావడం లేదు. మా ప్రభుత్వంపై కుట్ర జరిగింది. ” అని కుమారస్వామి అన్నారు.

బలపరీక్షకు ముందే తన సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేస్తారని చెబుతున్నారు కర్ణాటక నాయకులు.