
కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం ఓడిపోయింది. పలు వాయిదాలు.. వాదోపవాదాల మధ్య సుదీర్ఘ చర్చ తర్వాత.. విశ్వాస పరీక్ష నిర్వహించారు కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిపారు. విశ్వాస పరీక్ష తీర్మానానికి అనుకూలంగా.. 99మంది.. వ్యతిరేకంగా 105 మంది ఓటేశారు.
204 మంది సభ్యులు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రభుత్వం నిలబడాలంటే 103 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామికి కావాలి. కానీ 99 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో… కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ – కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.