కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో బాలన్ ది బాయ్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో బాలన్ ది బాయ్

భారీ చిత్రాలు నిర్మించే   కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ కలిసి  నిర్మిస్తున్న సినిమా ‘బాలన్ - ది బాయ్’.   ఈ చిత్రానికి  ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో   ‘మంజుమ్మెల్ బాయ్స్’  దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  

 ఈ నెల 14న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ బిజినెస్ వింగ్ అయిన మార్ష్ డు ఫిలింలో   ‘బాలన్ - ది బాయ్’   స్క్రీనింగ్ జరగనుందని మేకర్స్ తెలియజేశారు.   తమ మూవీ కేన్స్‌‌‌‌‌‌‌‌లో స్క్రీనింగ్ కానుండటంపై టీమ్ అంతా  సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు గొప్ప అనుభూతికి లోనవుతారని డైరెక్టర్ చిదంబరం అన్నాడు.  ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా తమ సినిమా ఉంటుందని నిర్మాత వెంకట్ కె నారాయణ అన్నారు.