ఆర్థిక వేధింపులతో ల్యాబ్​ టెక్నీషియన్​ సూసైడ్

ఆర్థిక వేధింపులతో ల్యాబ్​ టెక్నీషియన్​ సూసైడ్

బాల్కొండ, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో నిజామాబాద్​జిల్లాలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మోర్తాడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం డోడర్నాకు చెందిన ఆడే అజయ్(25) బతుకు దెరువు కోసం నిజామాబాద్​జిల్లాలోని మోర్తాడ్​కు వలస వచ్చాడు. మొన్నటి దాకా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేశాడు. ఇటీవల సొంతంగా ల్యాబ్ ఓపెన్​చేశాడు. అయితే గతంలో పనిచేసిన హాస్పిటల్​యాజమాన్యానికి అజయ్​రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉండగా, వారు ఒత్తిడి చేశారు.

తట్టుకోలేకపోయిన యువకుడు గత నెల 30న కనిపించకుండా పోయాడు. మోర్తాడ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం స్థానిక వరద కాలువలో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్పిటల్​యాజమాన్యం ఒత్తిడితోనే తమ బిడ్డ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం హాస్పిటల్​ముందు ఆందోళనకు దిగారు. ఎస్సై హామీతో ఆందోళన విరమించారు.