ఆరుగురు ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లికొచ్చిన క్లబ్ ఓనర్

ఆరుగురు ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లికొచ్చిన క్లబ్ ఓనర్

ఇండియాలో ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ. ఎక్కడో ఒకచోట ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. అయితే విదేశాలలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ఇద్దరు లేదా ముగ్గురుని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఆ పెళ్లి కూడా ఇద్దరికి ఇష్టం అయితేనే లేకపోతే డేటింగ్‌తో ఆపేస్తారు. నైజీరియాకు చెందిన క్లబ్ ఓనర్ ప్రెట్టీ మైక్ కూడా అలాగే చేశారు. ఆయన ఒకేసారి ఆరుగురు అమ్మాయిలతో డేట్ చేశాడు. మైక్ తన స్నేహితుడు, యాక్టర్ పాల్ విలియమ్స్ ఉచెంబో వివాహానికి తన ఆరుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాజరయ్యాడు. ఆ ఆరుగురు ఒకే కలర్ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడో విశేషముంది. అదేంటంటే.. ఆ ఆరుగురు గర్భవతులు. వారందిరినీ తీసుకొని మైక్ తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యాడు. అక్కడ వారందరినీ ఒకరి తర్వాత ఒకరి చేయి పట్టుకొని ముందుకు ఆహ్వానించాడు. అంతేనా.. తనకు ఒకేసారి ఆరుగురు బిడ్డల్ని ఇవ్వబోతున్న వారి పొట్టపై చేయి వేసి నిమురుతూ వారిని ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

For More News..

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

చంద్రుడిపై దిగిన విదేశీ రోవర్